తరలివచ్చిన జనం.. భరోసా ఇచ్చిన బాబు!

posted on: Aug 3, 2024 12:59PM

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం అయిన ఎన్టీఆర్ భవన్‌కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు వచ్చారు. ఆయనని స్వయంగా కలసి వినతిపత్రాలు ఇవ్వడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. ఎన్టీఆర్ భవన్‌కి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరికి చంద్రబాబు వెళ్ళి వాళ్ళ నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. వీరిలో ఎక్కువశాతం అనారోగ్యంతో బాధపడుతున్నవారే వున్నారు. అందరి సమస్యలు పరిష్కరిస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...