జగన్ పోవాలి.. బాబు రావాలి.. చంద్రబాబు పర్యటనలో జనం నినాదం!
posted on: May 7, 2022 12:26PM
బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలలో పాల్గొనేందుకు జిల్లాలలో పర్యటిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ప్రసంగాలకు జనం స్పందన రాష్ట్ర ప్రజల మూడ్ ను పట్టిస్తోంది. క్విట్ జగన్.. సేవ్ ఏపీ అన్న చంద్రబాబు పిలుపునకు జగన్ పోవాలి.. బాబు రావాలి అన్న నినాదంతో జనం స్పందిస్తున్నారు.
ఈ స్పందన రాష్ట్రంలో ప్రజలు మార్పు కొరుకుంటున్నారన్న దానికి అద్దం పడుతోందనంటూ చంద్రబాబు చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.
\రాష్ట్రంలో మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు జిల్లాలలో విస్తృతంగా పర్యటించారు. ఏడు జిల్లాలలో 21 నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగిన ఈ యాత్ర తెలుగుదేశం క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపింది. ప్రజా సమస్యలు, ధరల బాదుడుపై బాబు స్వయంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. జగన్ పాలనలో కష్టాలు, ఇబ్బందల గురించి జనం వివరణ వారిలో ప్రస్తుత ప్రబుత్వంపై ఉన్న ఆగ్రహం, అసహనం ప్రస్ఫుటమైంది. ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో జనం మార్పు కోరుకుంటున్న తీరు స్పష్టంగా కనిపించిందని పేర్కొంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
జనంలో జగన్ పాలన పట్ల వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం ప్రస్ఫుటమై.. రాష్ట్రంలో రాబోయే మార్పును కళ్లకు కట్టాయని చంద్రబాబు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. వాడవాడలా వెల్లువలా కదిలి వచ్చి తనక స్వాగతం పలికి ఆదరించిన జనానికి చంద్రబాబు ఆ ట్వీట్ లో ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ఏడు జిల్లాల పర్యటనకు వచ్చిన స్పందన రాష్ట్రంలో జనం మూడ్ ను, ప్రభుత్వంపై వారికి ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబించిందని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా ఈ యాత్రకు వచ్చిన జనస్పందన మొత్తం రాష్ట్రం ఏం కోరుకుంటోందో తెలియజేసిందంటున్నారు.






