Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ మేనిఫెస్టోపై వైసీపీ సోషల్ మీడియా అతి!
posted on: Apr 28, 2024 8:15AM
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన వర్గీయుల అరాచకం పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయింది. వారి క్రియేటివిటీని చూసి ఏపీ ప్రజలు తలలు పట్టుకున్నారు. ఇదేంట్రా బాబు.. మనం ఏమైనా పిచ్చోళ్లమా అని చర్చించుకుంటున్నారు. ఇంతకీ జగనన్న అంత మతిపోయే పని ఏం చేశాడని అనుకుంటున్నారా..? ఇన్నాళ్లు జగనన్న చేసినవన్నీ ప్రజలకు మతులు పోగట్టే పనులే కదా.. ఇంకా కొత్తగా ఏముంది మతిపోవటానికి అనుకుంటున్నారా? తాజాగా వైసీపీ సోషల్ మీడియా క్రియేటివిటీతో ఎవరికైనా మతిపోవాల్సిందే. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ మ్యానిఫెస్టోను శనివారం (ఏప్రిల్ 27) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యానిఫెస్టో విడుదల సమయంలోనూ తెలుగుదేశం అధినేత చంద్రబాబును తిట్టడమే పనిగా జగన్ పెట్టుకున్నారు. చంద్రబాబు పేద ప్రజలకు ఏమీ చేయలేదట.. జగన్ మోహన్ రెడ్డి మాత్రం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి పనులు పేదల కోసం చేశారంట. అడిగేవాడు లేకపోతే.. బెదిరించే వాడిదే రాజ్యం అన్నట్లుగా మ్యానిఫెస్టో విడుదల సమయంలో జగన్ ప్రసంగం ఉంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాను ఏం చేసినా ఎవ్వరూ ప్రశ్నించకూడదనే స్వభావంతోనే పాలన సాగించారు. ఐదేళ్ల కాలంలో ఆయన్ను ప్రశ్నిచిన ఎవర్నీ జగన్ వదిలిపెట్టలేదు. చంద్రబాబు నుంచి.. రఘురామ కృష్ణంరాజు వరకు ఎవ్వరూ జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి తప్పించుకోలేక పోయారు. కేవలం ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశాడు. ఏపీలో చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన కంపెనీలను తరిమేసిన జగన్.. కనీసం రోడ్లపై ప్యాచ్ వర్కులు కూడా చేయించలేక పోయారు. ఏపీ ప్రజలు జగన్ పాలనపై మండిపడుతున్నా.. వైసీపీ అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామంటూ ఢంకా మోగించారు. మ్యానిఫెస్టో విడుదల సమయంలో 99శాతం హామీలు నెరవేర్చామని జగన్ చెప్పడంపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చి ఎలాంటి భయం లేకుండా ప్రజల మధ్యన ర్యాలీలు, సభల్లో పాల్గొంటుంటే ఆ ఆనందమే వేరు అన్నట్లుగా జగన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇది విన్న ప్రజలు.. మరి ఇన్నాళ్లు పరదాల మాటున ఎందుకు తిరిగావ్ జగనన్నా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసి.. చంద్రబాబు హయాంలో జరిగిన కాసింత అభివృద్ధినికూడా నిర్వీర్యం చేయడం తప్పితే జగన్ ఏపీ ప్రజలకు కొత్తగా చేసింది ఏమీలేదన్నది జగమెరిగిన సత్యం. కళ్లముందు ఇన్ని వాస్తవాలు కనిపిస్తున్నా, వైసీపీ సోషల్ మీడియా క్రియేటివిటీని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మ్యానిఫెస్టో విడుదల సమయంలో వైసీపీ సోషల్ మీడియాలో పలు వీడియోలు ప్రత్యక్ష మయ్యాయి. ఈ వీడియోల్లో ఓ వృద్ధురాలు మ్యానిఫెస్టోలో కొత్త పథకాలు ఏంఏం ప్రకటిస్తున్నారోనని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.. మరొక వీడియోలో మ్యానిఫెస్టో ప్రకటిస్తున్న జగన్ మోహన్ రెడ్డికి కొందరు మహిళలు ఏకంగా హారతి ఇచ్చేస్తున్నారు.. మరో వీడియోలో కొందరు గ్రామస్తులు జగన్ మోహన్ రెడ్డి మ్యానిఫెస్టో చదువుతుంటే ఉత్కంఠభరితంగా టీవీని వీక్షిస్తున్నారు.
ఒకపక్క వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మ్యానిఫెస్టో ప్రకటిస్తుంటే.. మరోపక్క వైసీపీ సోషల్ మీడియా ముందుగానే ప్లాన్ చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు జగన్ మోహన్ రెడ్డి, ఆయన టీంకు పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లిందంటూ కామెంట్లతో తమ ఆగ్రహాన్ని వెలుబుచ్చారు. ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని ఇప్పటికే సర్వేలన్నీ తేల్చేశాయి. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్న జగన్.. ఎలాగైనా ప్రజలను మయాచేసి మరోసారి అధికారంలోకి రావాలని అన్నిప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గులకరాయి డ్రామాను తెరపైకి తెచ్చినప్పటికీ.. అది తుస్సుమంది. గతంలో కోడి కత్తి డ్రామా, బాబాయ్ హత్యకేసును చంద్రబాబుపై నెట్టడం వంటి విషయాలను గుర్తు చేసుకున్న ప్రజలు గులకరాయి డ్రామాను ఈడ్చితన్నారు. అయినా జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో సానుభూతిని పొందేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే బాహుబలి సినిమా లెవల్లో ప్రజలను ఆకట్టుకునేలా ముందస్తుగా రూపొందించిన వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో ప్లాట్ ఫాంలలో ప్రజలపైకి వదిలారు. ఇలాంటి ట్రిక్ లను జగన్, ఆయన బ్యాచ్ ఎన్ని ప్రయోగించినా ప్రజలు మాత్రం ఓటు ద్వారా ఏపీ నుంచి వైసీపీని తరిమికొట్టేందుకు సిద్ధమయ్యారు.






