TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు జగన్ కుట్ర : పయ్యావుల

Published on: Tue Jul 8, 2025 9:52PM

 

ఏపీ బ్రాండ్‌ను  దెబ్బతీసేందుకై మాజీ సీఎం జగన్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి కుట్రలు చేస్తూ  రాష్ట్రంలో  ఏదో జరిగిపోతున్నదంటూ గగ్గోలు పెడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి  పయ్యావుల కేశవ్ అన్నారు. సచివాలయంలో నిర్వహించిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమకు ఓట్లు వేయలేదనే అక్కసుతో ప్రజల సంక్షేమాన్ని, అభివృద్దిని అడ్డుకునేందుకు  పరోక్షంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాభివృద్దికై ఏపిఎండిసి ద్వారా రూ.9 వేల కోట్ల మేర ఋణా తెచ్చేందుకు  ప్రభుత్వం జి.ఓ. నెం.32 ను ఈ ఏడాది మార్చిలో జారీ చేసినప్పటి నుండి ఆ ఋణం రాకుండా అడ్డు పడేందుకు విఫల యత్నం చేశారని పేర్కొన్నారు. 

జర్మనీలో పనిచేస్తున్న విప్రో ఉద్యోగి ఉదయభాస్కర్ అనే అతనితో  బాంబో మార్కెట్లోని పెట్టుబడిదాలు అందరికీ  పెట్టుబడులు పెట్టవద్దు అంటూ దాదాపు 200 మెయిల్స్  పంపించారు. వైసీపీ పార్టీకి చెందిన రాజ్య సభ సభ్యులు మరియు ఫైనాన్సు స్టాండింగ్ కమిటీ సభ్యులతో కేంద్ర ప్రభుత్వానికి ఆర్.బి.ఐ.కి సెబీ కి కంప్లైంట్స్ పెట్టించారు, వారి పార్టీ సభ్యులు లేళ్ల అప్పరెడ్డితో హైకోర్టులో  పిల్ వేయించారని ఆర్థిక మంత్రి తెలిపారు. వీళ్లు ఎన్ని కుట్రలు చేసినా ఏపీ బ్రాండ్ ఎక్కడా తగ్గలేదు, ఓవర్ గా సబ్ స్క్రైబ్ చేశారు. ఇప్పటికైనా వాళ్లు ఏడుపులు ఆపితే మంచిదని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్దిని అడ్డుకునేలా వీరు చేసిన తప్పుడు ప్రచారానికి, రాద్దాంతానికి దేశ ద్రోహం కేసులు వీరిపై పెట్టాలని అన్నారు