పేటీఎం మళ్లీ వెనక్కీ - గూగుల్ ప్లేస్టోర్ లోఅందుబాటు

పేటీఎం కరో అంటూ విసృత్త ప్రచారంతో దాదాపు ఐదు కోట్లమందికి చేరువైన పేటీఎం యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి  తొలగించిన కొన్ని గంటల్లోనే తిరిగి యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆర్థికలావాదేవీలను డిజిటలైజ్ చేసిన ఈ యాప్ ను తొలగించడానికి కారణాలు గూగుల్ వివరించింది.

పేటీఎం సంస్థ గ్యాంబ్లింగ్‌ నిబంధనలు చాలా సార్లు ఉల్లంఘించిందని.. పదేపదే చెప్పినా , నోటీసులు జారీ చేసినా ఆ సంస్థ తీరులో మార్పు లేదని గూగుల్ ప్రకటించింది. గూగుల్‌ సంస్థ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ బెట్టింగులు నిషేధం. అయితే  పేటీఎం, పేటీఎం ఫస్ట్‌గేమ్‌ యాప్స్‌ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చి వాటి ద్వారా గేమ్స్ ఆడే అవకాశం కల్పిస్తోంది. దీంతో చాలామంది డబ్బులు కోల్పోయారు. బెట్టింగులు ప్రోత్సహించేదిగా ఉండటంతో గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకుంది.  పేటీఎం, పేటీఎం ఫస్ట్ గేమ్స్ యాప్స్ ను గూగుల్ తొలగించింది. అయితే పేటీఎం బిజినెస్‌, పేటీఎం మాల్‌, పేటీఎం మనీ యాప్స్‌ మాత్రం గూగుల్ ప్లేస్టోర్ లో యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. పేటీఎంకు దాదాపు ఐదు కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 

గూగుల్ చర్యపై స్పందించిన పేటీఎం వెంటనే స్పందించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించబడిన కొన్ని గంటల్లోనే ‘Update: And we are back’ అంటూ ట్వీట్టర్ ద్వారా వినియోగదారులకు సమాచారం చేరవేసింది. ఇంతకుముందులానే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేటీఎం స్పష్టం చేసింది. పేటీఎంతో లింకై ఉన్న అన్ని అకౌంట్లు నూటికి నూరుశాతం  సేఫ్ అని ట్విట్ట్ చేసింది.దాంతో గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించిన కొన్ని గంటల్లోనే తిరిగి అందుబాటులోకి వచ్చింది.
ఇటీవల సోషల్ మీడియా దిగ్గజాలైన సంస్థలు తమ ఖాతాదారుల చర్యలను గమనిస్తూ వారిపై నిబంధనల ఉల్లంఘన చర్యలను తీసుకోవడం గమనించదగిన విషయం.