అసమాన ప్రతిభ కనబరిచిన దేవాన్ష్.. పవన్ ప్రశంసల వర్షం
posted on Jan 27, 2025 12:41PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు అయిన నారా దేవాన్ష్ పై జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. పిన్న వయస్సులోనే అతి స్వల్ప వ్యవధిలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసిన నారా దేవాన్ష్ భవిష్యత్ లో గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదుగుతాడని ఎక్స్ లో పోస్టు చేశారు.
అలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. దేవాన్ష్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలోనే 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అందుకు దేవాన్ష్ ను అభినందించిన పవన్ కల్యాణ్ దేవాన్ష్ సాధించిన ఘనతకు సంబంధించిన వీడియోను కూడా ఆ పోస్టుకు జత చేశారు.
