TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రైతులకు అండగా పోరాటం.. పవన్ కళ్యాణ్

Published on: Fri Apr 10, 2015 1:57PM

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని రైతులకు అండగా పోరాటం చేయబోతున్నట్టు సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించారు. తన ట్విట్‌లో ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఏపీ ప్రభుత్వం రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించనున్నట్లు హైకోర్టుకు తెలిపిందని, రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతుల మీద భూసేకరణ చట్టం ఉపయోగిస్తే తాను రైతులకు అండగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని పవన్‌కల్యాణ్‌ ట్విట్టర్‌లో ప్రకటించారు.