''అత్తారింట్లో..'' మెగాస్టార్ పై పవర్ స్టార్ సెటైర్
posted on Sep 28, 2013 2:16PM
.jpg)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ 'అత్తారింటికి దారేది' లో ఒక సన్నివేశంలో ఆయన పలికిన సంభాషణలు ఇండస్ట్రీలో పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. చిరంజీవిపై పవన్ కళ్యాణ్ సెటైర్లు విసిరే సంభాషణ కావడంతో దాని పట్ల అందరూ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాలో ఒక సీన్ లో పవన్ టీవిలో చూస్తూ....
పవన్ : ఆయన ఎవరూ''
ఎంఎస్: చిరంజీవి సార్''
పవన్ : యాక్టింగ్ బాగా చేస్తున్నాడు. ఇప్పుడేం చేస్తున్నారు?''
ఎంఎస్: మానేసారు సార్''
పవన్ : ఎందుకు..?''
ఎంఎస్: వాళ్ళబ్బాయి చేస్తున్నాడు.
త్రివిక్రమ్ కి చిరంజీవి ఎవరో తెలియదనే సీన్ ఎందుకు సృష్టించాల్సి వచ్చిందో ఎవరి అర్ధం కావడం లేదు. అసలు ఈ ఐడియా త్రివిక్రమ్ దేనా లేక పవర్ స్టార్ దా అని చర్చించుకుంటున్నారు.