పవన్ కళ్యాణ్‌కి పిచ్చి ముదిరిందట!

posted on: May 5, 2014 4:39PM

 

 

 

పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాని, పిచ్చి ముదిరిన పిల్లాడు.. ఈ కామెంట్లు చేసింది ఎవరో కాదు.. జగన్ పార్టీలో వున్న మహిళా తిట్ల స్పెషలిస్టు వాసిరెడ్డి పద్మ. పాపం ఈమె చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త. ఏ పార్టీలో వున్నా ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టడంలో బోలెడంత అంకితభావం చూపిస్తూ వుంటారు.

 

తాజాగా పవన్ కళ్యాన్ జగన్‌ని విమర్శలతో తూట్లు పొడుస్తున్నారు. అయితే జగన్ మాత్రం పవన్ కళ్యాణ్‌ని మాత్రం ఏమీ అనడం లేదు. పవన్ కళ్యాణ్‌ది తన స్థాయి కాదని అనుకున్నాడేమోనని, తన పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మేడమ్‌కి పవన్ కళ్యాణ్‌ని విమర్శించే బాధ్యతలు అప్పగించారు. దాంతో పద్మగారు పవన్ కళ్యాణ్‌ని తిట్టడం మొదలుపెట్టారు.



ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ లైమ్ లైట్‌లోకి వచ్చిన పద్మ మేడమ్ ఇప్పుడు జగన్ పార్టీలోకి మారడం వల్ల పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదు.  రీసెంట్‌గా ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటి లాగానే చంద్రబాబుని తిట్టడంతోపాటు పనిలోపనిగా పవన్ కళ్యాణ్‌ని కూడా తిట్టిపోశారు. పవన్ ఒక అజ్ఞాని, పిచ్చి ముదిరిన పిల్లవాడని ధ్వజమెత్తారు. పవన్ తన తప్పుడు మాటలకు అర్జెంటుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...