TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కల్యాణ్ తన బిగ్ బ్రదర్ అన్న నారాలోకేష్

Published on: Sat Feb 28, 2026 8:48AM

 అభివృద్ధి చెందిన రాష్ట్రాలే  దేశాన్ని బలంగా తయారుచేస్తాయనీ,  నైతికత, విలువలు లేని అభివృద్ధికి అర్థంలేదనీ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు.   వృద్ధిరేటు, పెట్టుబడులతోపాటు తదుపరి తరం విద్య కీలకపాత్ర వహిస్తుందని తాను బలంగా నమ్ముతానని పేర్కొన్నారు. ముంబయిలో ఎబిపి నెట్ వర్క్ ఆధ్వర్యంలో  ఐడియాస్ ఆఫ్ ఇండియా -2026 పేరిట నిర్వహించిన సదస్సులో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ...  2047నాటికి ఆంధ్రప్రదేశ్ ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యం అన్నారు.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  మాట ఇస్తే అది జరిగి తీరుతుంది. ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించడమే తన ముందున్న కర్తవ్యమని చెప్పారు.  ఒత్తిడి లేదనీ,  సవాళ్లను ఇష్టంగా స్వీకరిస్తామని చెప్పారు. ఫైర్ సైడ్ చాట్ లో మోడరేటర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ,  కష్టకాలంలో వెన్నంటి నిలచిన పవన్ కళ్యాణ్ తన బిగ్ బ్రదర్ అన్నారు.  

ఇప్పుడు అమరావతి అనేది భవిష్యత్తు. పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఎపికి రాలేకపోతే తర్వాత ఎందుకు రాలేకపోయామని బాధపడతారన్న లోకేష్..  ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్  విషయంలో కూడా అదే జరిగింది. మీరు ప్రతి వందరోజులకోసారి అమరావతిని సందర్శించండి. అక్కడ రాజధాని నిర్మాణం ఎంతవేగంగా జరుగుతుందో చూడండి. భారతదేశం గర్వించేలా పనులు శరవేగంగా సాగుతు న్నాయ న్నారు.