Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ కళ్యాణ్ కలుసుకున్న ఒంగోలు ఎంపీ మాగుంట
posted on: Mar 27, 2024 5:01PM
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని జనసేన పార్టీ వెల్లడించింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం తన కుమారుడు మాగుంట రాఘవతో కలిసి మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. పవన్ కల్యాణ్ ను కలిసి ఆయనతో పలు అంశాలపై చర్చించారు. వీరి వెంట ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా ఉన్నారు. మాగుంట ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన టీడీపీలో చేరడం తెలిసిందే.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒంగోలు లోకసభ నుంచి మాగుంట కుటుంబం నుంచి ఒకరికి టిడిపి టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ను తండ్రీ కొడుకులు కలుసుకున్నారు.






