పవన్ కళ్యాణ్ మరో మారు అస్వస్థత 

posted on: Apr 8, 2024 12:29PM

ఎపిలో ఎండలు మండిపోతున్నాయి. మే 13న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో త్రికూటమి అభ్యర్థులు దూకుడు పెంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి వారాహి  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఎండ వేడి తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. నిన్న రెండోసారి వారాహి యాత్ర ప్రారంభమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మరో మారు అస్వస్థతకు గురయ్యారు. 
జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మరోమారు రద్దయింది. నిన్న అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభ అనంతరం జ్వరం రావడంతో నేటి యలమంచిలి పర్యటనను పవన్ రద్దుచేసుకున్నారు. ఎండల వేడిమి కారణంగా పవన్ తరచూ జ్వరం బారినపడుతుండడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 
ఇటీవల ఆయన జ్వరం బారినపడడంతో రెండు రోజులపాటు పర్యటనను రద్దుచేసుకుని నిన్నటి నుంచి వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన అనంతరం పవన్ మళ్లీ జ్వరం బారినపడ్డారు. దీంతో నేటి పర్యటనను రద్దుచేసుకున్నారు. కాగా, ఈ నెల తొలివారంలో పవన్ తెనాలి పర్యటన కూడా రద్దయింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...