Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...‘పవన్ కళ్యాణ్ హఠావో’ పుస్తకం వెనుక వున్నదెవరు?
posted on: May 5, 2014 12:14PM

పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టిన వెంటనే చేసిన నినాదం ‘కాంగ్రెస్ హఠావో... దేశ్ బచావో’. ఈ నినాదం ఆయన్ని మోడీకి చేరువ చేసింది. తెలుగుదేశం పార్టీకి చేరువ చేసింది. ఈ నినాదాన్ని పవన్ కళ్యాణ్ రకరకాలుగా మారుస్తూ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ డైలాగ్‌ని పవన్ కళ్యాణ్ మీదే రాజకీయ ప్రత్యర్థులు ప్రయోగించారు. ‘పవన్ హఠావో.. సీమాంధ్ర బచావో’ అనే పుస్తకం ఒకటి విడుదల చేశారు. ఆ పుస్తకం కూడా ఎవరో దారిన పోయే దానయ్య రాయలేదు.. పవన్ కళ్యాణ్ అభిమానే రాశాడట. ఈ పుస్తకం వెనుక జగన్ పార్టీయే వుండొచ్చన్న అనుమానాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం సీమాంధ్రలో ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ జగన్ మీద విమర్శులు గుప్పిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే సీమాంధ్ర సర్వనాశనం కావడం ఖాయమని స్పష్టంగా చెబుతున్నారు. అందుకే ఆయనను డ్యామేజ్ చేయడానికే ఓ ‘అభిమాని’ని పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా పుస్తకం రాయించారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.



.jpg)


