'ఎవడు' ఆడియోకి పవన్ కళ్యాణ్
posted on Jun 28, 2013 5:00PM
.jpg)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఎవడు' ఆడియో ఈ నెల 30న తేదిన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్ కి మెగా హీరోలు అందరూ వస్తారని సమాచారం. ముఖ్యఅతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ కోసం యూరప్ వెళ్ళారు. అక్కడ షూటింగ్ ముగించుకొని ఈ నెల 30న హైదరాబాద్ కి వస్తున్నారు. అదే రోజు సాయంత్రం 'ఎవడు' ఆడియో ఫంక్షన్ లో పాల్గొంటారని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఉత్తరఖాండ్ వరద బాధితుల పనుల పర్యవేక్షణలో బిజీగా ఉండడంతో ఆయన హాజరుకాకపోవచ్చునని చెబుతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్, బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది.