TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కళ్యాణ్ 'పవర్' వార్నింగ్

Published on: Tue Oct 15, 2013 2:44PM

 

 

Video Courtesy TV9
 

 

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఇప్పుడు ఇదే టాలీవుడ్ పవర్ టాపిక్. ఎప్పుడు ఆడియో ఫంక్షన్ లలో మాత్రమే కనిపించే పవన్..ఆ తరువాత తన తదుపరి సినిమా ఆడియో వరకూ ఎవరికి కనిపించరు. సినిమా హిట్టైన..ఫ్లాప్ అయిన అసలు పట్టించుకోరు. ఆయన సినిమాకు సక్సెస్ మీట్స్ అస్సలుండవ్. కాని ‘అత్తారింటికి దారేది’ సినిమా కి మాత్రం ఆయన సక్సెస్ మీట్ పెట్టారు!

 

సక్సెస్ మీట్ మీట్ లో అదిరిపోయే స్పీచ్ తో పాటు...పవర్ ఫుల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ‘అత్తారింటికి దారేది’ విడుదలకు ఒక్క రోజు ముందుగా బయటకి లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ లీకేజీ పై పవర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అత్తారింటికి దారేది సినిమా పైరసీకి గురికాలేదు..దాని మీద కుట్ర జరిగింది. ఆ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారు నాకు తెలుసు..అనగానే అభిమానులు వారెవరో చెప్పాలని ప్రశ్నించారు. చెప్తాను..ఇది ఇప్పటితో అయిపోలేదు...కుట్ర దారులకు ఇదే హెచ్చరిక.. భరిస్తాం..భరిస్తాం.. చివరకు తాట తీస్తాం. సమయం దొరికినప్పుడు వారికి తగిన న్యాయం చేస్తా. అందర్నీ గుర్తు పెట్టుకుంటా” అని చెప్పడంతో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.



అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ మీద దెబ్బకొట్టేందుకే ఈ ప్రయత్నాలు చేశారని, పోలీసు విచారణలో పలు పేర్లు వెల్లడయినట్లు తెలుస్తోంది.  మరి పవన్ మీద అంత పగ పెంచుకున్న వాళ్లు ఎవరా? అన్నది బయటికి వచ్చె వరకు వేచి చూడాలి.