పవన్ కల్యాణ్ ను కలిసిన శ్రీజ
Published on: Mon Apr 20, 2015 5:39PM

గతంలో ఖమ్మంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న శ్రీజను జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీజ పూర్తిగా కోలుకుంది. కుటుంబసమేతంగా హైదరాబాద్ వచ్చి పవన్ కల్యాణ్ ను కలుసుకొంది. దాదాపు రెండు గంటలపాటు పవన్ కల్యాణ్ శ్రీజ కుటుంబంతో గడిపారు. తను అనారోగ్యంతో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ వచ్చి కలిసినందుకు చాలా సంతోషించానని శ్రీజ తెలిపింది. కోలుకున్న తరువాత ఆయనను కలవాలనే ఇక్కడికి వచ్చానని, కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.


