బీజేపీ కండువా వద్దన్న పవన్ కళ్యాణ్

posted on: May 2, 2014 12:48PM

 

 

 

‘జనసేన’ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేస్తున్నప్పటికీ, ఆ పార్టీల కండువాలు కప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. టీడీపీ, బీజేపీ కూటమి ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు ఈ పార్టీ కండువాలను, ఈ పార్టీ నాయకులు ఆ పార్టీ కండువాలను కప్పుకుంటూ వున్నారు. అయితే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మాత్రం ఏ పార్టీ కండువానీ కప్పుకోకుండానే వేదికల మీద ప్రసంగిస్తున్నారు. వేదికల మీద ఏ పార్టీ కండువానీ తన మెడలో వేయడానికి ప్రయత్నించవద్దని పవన్ కళ్యాణ్ మొదట్లోనే రెండు పార్టీల అగ్ర నాయకులకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన మెడలో ఇంతవరకు ఏ పార్టీ కండువా కనిపించలేదు. అయితే భీమవరంలో మోడీతో కలసి పాల్గొన్న సభలో ఒక బీజేపీ నాయకుడు అత్యుత్సాహంతో పవన్ కళ్యాణ్ మెడలో బీజేపీ కండువా వేయబోయాడు. అయితే పవన్ కళ్యాణ్ వెంటనే తల బీజేపీ కండువాకి దూరంగా జరిపేశాడు. తల అడ్డంగా ఊపుతూ తనకు కండువా వేయొద్దన్న సంజ్ఞ చేయడంతో సదరు అత్యుత్సాహ బీజేపీ నాయకుడు నాలుక్కరుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...