పవన్ పేరుతో మారుమోగిన 'ఎవడు' ఆడియో
Published on: Tue Jul 2, 2013 10:18AM
.jpg)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ఎవడు' ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ కు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. అయితే 'ఎవడు' ఆడియో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకపోయేసరికి మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆడియో ఫంక్షన్ మొత్తం పవన్ కళ్యాణ్ పేరుతో మారుమోగింది. దీంతో అభిమానులను సముదాయించడానికి చిరు పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించారు. ఎవడు విజయోత్సవానికి మాత్రం పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తాడని చిరంజీవి అన్నారు. దర్శకుడు పైడిపల్లి వంశీ తనకు చెప్పినట్టుగానే కథను తెరకెక్కించారని చెప్పారు. నిర్మాత దిల్ రాజు నిర్మాణ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారని అన్నారు.


