కాపులకు న్యాయం చేయాలి : పవన్

posted on: Feb 7, 2016 5:18PM

 

కొద్ది రోజుల క్రితం కాపుగర్జన సందర్భంగా జరిగిన పరిణామాలకు, షూటింగ్ ఆపి హైదరాబాద్ వచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టారు పవన్. ఆయన ప్రెస్ మీట్ లో కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడిన తీరును చాలామంది విమర్శించారు. దాంతో ఈ సారి పవన్ తన ట్విట్టర్లో స్పందించారు. కాపు రిజర్వేషన్ ఇష్యూ రోజురోజుకూ పెద్దదిగా మారుతుండటంతో, ఎలాగైనా సమస్యను పరిష్కరించాలని ఆయన టీడీపీని కోరారు.

కాపు నాయకులతో, టీడీపి ప్రభుత్వం చర్చలు జరిపి, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని, లేనిపక్షంలో పరిస్థితులు చేయదాటిపోతే, ఇక ఎవరూ చేయగలిగిందేమీ లేదని ఆయన ట్వీట్ చేశారు. సమన్వయంగా వ్యవహరించే పెద్దల సమక్షంలో, సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆయన పేర్కొనడం విశేషం..తాజాగా దాసరి నారాయణరావుతో, మెగా స్టార్ చిరంజీవి కిర్లంపూడి వెళ్లి ముద్రగడను కలుస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ ట్వీట్ ప్రాథాన్యం సంతరించుకుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...