పట్టిసీమ ఎత్తిపోతలకు శంకుస్థాపన

posted on: Mar 29, 2015 1:52PM

 

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలో ఏర్పాటు చేయనున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాణిక్యాలరావు, ఎంపీలు గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సుదీర్ఘకాలం పడుతుంది కాబట్టి ఈలోపు రాష్ట్రంలోని కృష్ణాడెల్టా, రాయలసీమ నీటి అవసరాలను తీర్చడం కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పట్ల ఏపీ అంతటా హర్షం వ్యక్తం అవుతోంది. ఒక ఏడాది కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...