పార్లమెంట్ దగ్గర తుపాకీ కాల్పులు..
Published on: Mon Jul 27, 2015 1:15PM

పంజాబ్ లో గురుదాస్‌పూర్ జిల్లా దినానగర్ లో ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పౌరులు, పోలీసులు కలిపి మొత్తం 9మంది మరణించారు. ఈ ఘటనతో ఇప్పటికే భయాందోళనతో ఉండగా పార్లమెంట్ దగ్గర తుపాకీ మోత కలకలం రేపింది. భారీగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అది పార్లమెంట్ వద్ద జరిగిన మాక్ డ్రిల్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దేశ సరిహద్దులతో పాటు ప్రముఖ నగరాలు, పట్టణాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.


