పార్లమెంట్ ప్రారంభం.. వాయిదా...
Published on: Mon Nov 24, 2014 10:46AM

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభలో ప్రధాని మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించిన నేపథ్యంలో కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. అలాగే ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీదేవరాకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. అనంతరం పార్లమెంట్ మంగళవారానికి వాయిదా పడింది. ఈ సభలోనే కాశ్మీర్ వరదల మృతులకు, హుద్ హుద్ తుఫాను మృతులకు లోక్‌సభ సంతాపం తెలిపింది.


