Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్!
posted on: Jul 30, 2024 2:14PM
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టిలు అదరగొడుతున్నారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మన అమలాపురం కుర్రాడేనండోయ్! ఒలింపిక్స్ చరిత్రలోనే క్వార్టర్ ఫైనల్స్.కి చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ జోడీగా చరిత్ర సృష్టించారు. గ్రూప్ దశలో కూడా వీరిద్దరూ అద్భుత ప్రదర్శన చేసి టాప్-8లో నిలిచారు.
జర్మనీ జోడీ మార్క్-మెర్విన్‌తో జరగాల్సిన డబుల్స్ మ్యాచ్ రద్దైంది. జర్మన్ ప్లేయర్ మార్క్‌కు మోకాలికి గాయం కావడంతో అతను టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్ రద్దయింది. గ్రూప్ ‘సి’లో ఆర్టియాంటో-ఆల్పియన్ (ఇండోనేషియా) చేతిలో 21-13, 13-10 తేడాతో ఫ్రెంచ్ జోడీ లాబార్-కోర్వీ ఓడిపోవడంతో సాత్విక్-చిరాగ్ జోడీ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ జోడీ స్వర్ణాన్ని సాధించే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






