దాన‌శీలి అంటే పాండ్య‌న్‌

posted on: Jul 28, 2022 10:26AM

దానం చేసేవాడు దేవుడితో స‌మాన‌మంటారు. దాన‌మ‌న‌గానే రాజులు, ధ‌నికులు త‌మ ప్ర‌తిష్ట‌ను పెంచు కోవడానికి చేసే ధ‌ర్మాలు కావు. మ‌న‌స్పూర్తిగా ఎలాంటి ప‌రిస్థితిల్లో ఉన్నా బీద‌సాద‌లను  ఆదుకోవాల‌ని ఆశించి చేసేది అస‌లు ధ‌ర్మం. ఇటీవల వేలూరు కలెక్టరేట్‌లో జరుగుతున్న గ్రీవెన్స్‌సెల్‌కు 72ఏళ్ల పెద్దాయ‌ని ఒక చిన్న సంచీతో వెళ్లాడు. త‌న వ‌ద్ద ఉన్న ప‌దివేల రూపాయ‌లు తీసిచ్చాడు. త‌మిళ‌నాడు ముఖ్య మంత్రి స‌హాయ‌నిధి ద్వారా  శ్రీ‌లంక త‌మిళుల‌కు ఉప‌యోగించాల‌ని కోరాడు. ఆయ‌న పేరు పూల్ పాండ్య‌న్‌. ఆయ‌న భిక్షాట‌న చేసి మ‌రీ ఆ డ‌బ్బు అంద‌చేశాడు. అదీ దాన గుణం అంటే. దానం విశిష్టత గురిం చి మన సనాతన ధర్మంలో పేర్కొన్నారు. గుడులు, బడుల నిర్మాణం, అన్నదానం, విద్యాదానం వంటివి రాజులు, సంపన్నలు మాత్రమే చేస్తారు. కానీ పాండ్య‌న్‌ దానం వాట‌న్నింటికీ మించింది. 

తాను జీవనోపాధి కోసం భిక్షాటన చేయగా వచ్చిన చిల్లర సొమ్మును కూడబెట్టి లక్షలుగా సీఎం సహాయ నిధికి అందిస్తూ అందరకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. దేవాలయాల నిర్మాణానికి, స్కూల్స్ రిపేర్‌కి, శ్రీలంక లోని శరణార్ధులకు ఇలా ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో వివిధ జిల్లాల కలెక్టర్లకు రూ.55.60 లక్ష లు విరాళాలు అందించాడు. పుష్కరకాలంగా భిక్షాటన చేస్తూ వచ్చే డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో తాగు నీటి  సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొన‌డానికి ఆర్ధిక సాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇలా 50.60 లక్ష లు విలువ చేసే వస్తువులు, సొమ్మును విరాళం గా పలు సందర్భాల్లో అందజేసాడు.

ఎం.పూల్‌ పాండ్య‌న్‌ వద్ద కేవ‌లం  ఒక బ్యాగ్‌.అందులో టవల్, కావి ధోతి, టంబ్లర్, ప్లేట్. కోవిడ్-19  మహ మ్మారి విజృంభిస్తున్న సమయంలో పాండ్య‌న్‌ భిక్షాటన చేసి సంపాదించిన మొత్తాన్ని ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధికి విరాళంగా ఇచ్చాడు.  

పాండియన్ తన సంపాదనను తూత్తుకుడి, తంజావూరు, పుదుకోట్టై జిల్లాల్లోని పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి చాలా సంవత్సరాలుగా విరాళంగా ఇస్తున్నారు. తమిళనాడు ప్రజలు ఉదార ​​స్వభావులు. తమ కళ్ల ముందు ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసుకుంటారు. కొందరు డబ్బు విరాళంగా ఇస్తే, మరికొందరు తాను ఆకలితో ఉండకూడదని టీ, ఇడ్లీలు కొంటారని  చెప్పాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...