TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాలేరు ఉపఎన్నికకు తుమ్మల నామినేషన్.. అభ్యర్థిగా రాంరెడ్డి సతీమణి

Published on: Fri Apr 29, 2016 12:19PM

 

ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికలో భాగంగా నామినేషన్ల పర్వం సాగుతోంది. దీనిలో భాగంగానే.. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇక తుమ్మలకు ప్రధాన పోటీదారుగా భావిస్తున్న సుచరితారెడ్డి కూడా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.


కాగా రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి బరిలోకి దిగుతున్నారు.