TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెల్ఫీ చంపేసింది

Published on: Wed Dec 16, 2015 9:54AM

 

ఈమధ్య కాలంలో జనానికి సెల్ఫీల పిచ్చి బాగా పట్టింది. ఆ పిచ్చి చాలామంది ప్రాణాలు తీస్తున్నా జనంలో మార్పు రావడం లేదు. ఇప్పుడు పాకిస్థాన్‌లో ఓ యువకుడు సెల్ఫీ మీద మోజుతో ప్రాణాలే పోగొట్టుకున్నాడు. పాకిస్థాన్‌లోని రావల్పిండి ప్రాంతానికిచెందిన జంషేద్ ఖాన్ (22) రైల్వేలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తాను పనిచేస్తున్న రైల్వే స్టేషన్ దగ్గర కదలబోతున్న ఒక రైలు ముందు నిల్చుని సెల్ఫీ తీసుకోబోయాడు. అయితే రైలు వేగంగా కదలడంతో అతను రైలు కింద పడిపోయాడు. అతని మీద నుంచి రైలు చక్రం వెళ్ళడంతో అతను అక్కడే రెండు ముక్కలైపోయాడు. శరీరం రెండు ముక్కలైపోయినా జంషేద్ ఖాన్ చేతిలో వున్న సెల్‌ఫోన్ మాత్రం అలాగే వుండిపోయింది. ఆ ఫోన్‌లో సెల్ఫీ వుందో లేదో తెలియదుగానీ... జంషేద్ ఖాన్ ప్రాణాలు మాత్రం పోయాయి.