ఆ మంత్రి, ఎమ్మెల్యేల‌ రాస‌లీలలు? బ‌య‌ట‌పెడ‌తానన్న విప‌క్ష నేత‌..

posted on: Jan 5, 2022 1:44PM

ఆయ‌నో ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌. అనేక సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌కు ఫేమ‌స్‌. వైఎస్సార్ హ‌యాంలో ఓ వెలుగు వెలిగారు. ఆ త‌ర్వాత బాగా కామ్ అయ్యారు. ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ లైమ్‌లైట్‌లోకి వ‌స్తున్నారు. ఆయ‌న ఓ స్టేట్‌మెంట్ ఇస్తే.. అది ప‌క్కా బ్రేకింగ్ న్యూస్ అవుతుంద‌ని అంటారు. గ‌తంలో కేసీఆర్‌-కేటీఆర్‌-సంతోష్‌కుమార్‌ల అవినీతి చిట్టా, కుటుంబ క‌ల‌హాల గుట్టు ర‌ట్టు చేసింది ఆయ‌నే. అలాంటాయ‌న తాజాగా, ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యేపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వారి రాస‌లీల‌లు బ‌య‌ట‌పెడ‌తానంటూ వార్నింగ్ ఇవ్వ‌డం తెలంగాణ‌లో క‌ల‌క‌లం రేపుతోంది. 

మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్‌పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ రాసలీలలు త్వరలో బయట పెడతానని హెచ్చ‌రించారు. సలహాలు ఇస్తే తనను దళిత ద్రోహిగా చిత్రీకరిస్తున్నారన్నారు. రామగుండంలో ఇసుక, బూడిద మాఫియాలో ప్రజాప్రతినిధుల హస్తం ఉందని ఆరోపించారు. 

తాను దళిత వ్యతిరేకిని కాదని.. త‌నను కొప్పుల ఈశ్వర్, అతని అనుచరులు బద్నామ్‌ చేస్తున్నారని  గోనె ప్ర‌కాశ్‌రావు మండిపడ్డారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రామగుండం కార్పొరేషన్ అవినీతి మయంగా మారిందని... రామగుండం మేయర్‌ను దించే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...