TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంపి మాగుంట వద్ద జయలలిత నిధులు?

Published on: Wed Mar 28, 2012 10:07AM

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కోట్లాది రూపాయల నిధులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మాగుంట కుటుంబానికి మన రాష్ట్రంలోని అనేకమంది వ్యాపారవేత్తలు, సినీనటులతో పాటు తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారు తమ వద్ద ఉన్న అనధికార మొత్తాలను గత 20 ఏళ్ళుగా మాగుంట కుటుంబీకుల వద్ద దాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాలను మాగుంట కుటుంబం పలు వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెడుతోంది. అయితే వీరంతా మాగుంట కుటుంబం వద్ద డబ్బు దాయడానికి గల కారణం ఏమిటని ఆరా తీస్తే ఈ కుటుంబానికి నిజాయితీతో కూడిన కమిట్ మెంట్ చాలా ఎక్కువని తెలిసింది.

 

డబ్బులు ఎవరు దాచుకున్నా అణాపైసలతో సహా లెక్కకట్టి తిరిగి ఇచ్చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో ఎన్టీరామారావు కూడా పెద్ద మొత్తంలో నిధులను మాగుంట కుటుంబానికి అప్పగించారు. ఆయన మరణానంతరం ఒక్క మాగుంట కుటుంబీకులే తిరిగి ఆ మొత్తాన్ని ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించడంతో వారి ప్రతిష్ట మరింత ఇనుమడించింది. దీంతో వీరివద్ద డబ్బు దాచుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగిందని తెలిసింది. గతంలో కరుణానిధి కుటుంబానికి చెందిన కోట్లాది రూపాయలు వీరివద్ద ఉండేవని, ఇప్పుడు జయలలిత ఆర్జించిన మొత్తాల్లో కొంత భాగం వీరివద్దే దాచుకుంటుందని తెలిసింది. చిరంజీవికి చెందిన కొంత మొత్తం కూడా వీరి వద్దే భద్రంగా ఉన్నట్లు సమాచారం. మాగుంట కుటుంబం చాలా కమిట్ మెంట్ తో తమవద్ద డబ్బు దాచుకున్న వారి పెట్టుబడులను కాపాడుతూ వారు ఆడిగినప్పుడు అసలుతో పాటు వడ్డీలను కూడా చెల్ల్లిస్తోంది.