Latest News

ఒక విజ‌న‌రీ రాజ‌కీయ యాత్ర‌

posted on: Sep 1, 2022 6:16PM

ఇవాళ్టికి స‌రిగ్గా ఇరవై ఏడేళ్ల ఏళ్ల కిందట   సెప్టెంబర్ 1, 1995వ తేదీన ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా  నారా చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అప్ప‌టినుంచి ప‌ధ్నాలుగేళ్లు ప్ర‌జా రంజకంగా ప‌రిపాల‌న సాగించారు. ఈ ప‌ధ్నాలుగేళ్ల ప్ర‌స్థానంలో ఎన్నో మైలురాళ్లు, మ‌రెన్నో కీల‌క మ‌లు పులు. 

ప్రజలకు జవాబుదారీ పాలన అందించడం గురించి పాలకులు అంటే ప్రజలకు సేవకులు అన్న ఎన్టీ ఆర్ నినాదాన్ని అమలులోకి తెచ్చేందుకే ప్రజల వద్దకు పాలనతో ప్రభుత్వ అధికార గణాన్ని ప్రజలకు చేరువ చేశారు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల్లో ప్ర‌శ్నించే త‌త్వం పెరిగింది. మ‌రీ ముఖ్యంగా జ‌న్మ‌భూమి వంటి కార్య క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌ను పాల‌న‌లో భాగ‌స్వాములు చేయ‌డం. ఒక పనిని సాధించాలంటే ఒక విజన్ తో కూడిన స్పష్టమైన ప్రణాళిక అవసరం. అలాగే ఒక రాష్ట్రానికి కూడా దీర్ఘకాల ప్రణాళిక ఉండాలి. అదే చంద్ర‌బాబు రూపొందించిన 'విజన్-2020' అనే విజన్ డాక్యుమెంట్. అప్పట్లో ఎగతాళి చేసినవారే, ఆ తర్వాత ఆ విజన్ డాక్యుమెంట్ ఫలితాలను ప్రత్యక్షంగా అనుభ‌విస్తున్నారు. 

మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చి, ప్రపంచ ఐటీ రంగం దృష్టి రాష్ట్రంపై పడేలా చేయడంతో లక్షలాది ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ ఉద్యోగాలకు నిపుణులను సిద్ధం చేసేందుకు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలను అందుబాటులోకి తేవడం  ఆయ‌న పాల‌న కాలంలోనే  జరిగింది

అలాగే విద్యారంగంలో సమూల మార్పులు చేసి విద్యను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేసారు. ఆరోజు పడిన కష్టానికి ఫలితంగా ఈరోజు  ఒక రైతు బిడ్డ నుంచి  ఒక కార్మికుని కొడుకు వరకు దేశ విదేశాల్లో ఉద్యో గాలు చేస్తూ  కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.

ఈరోజు అమెరికాలో ఎక్కువ ఆదాయం పొందుతోన్న భారతీయుల్లో 30 శాతం మంది తెలుగువారే అన్న మాట వింటున్నాం. ఇది బాబు హ‌యాంలో విదేశాల‌కు విద్యార్ధులు వెళ్లి చ‌దువుకోవ‌డానికి వీలు క‌ల్పిం చిన తాలూకు స‌త్ఫ‌లితంగా చెప్పాలి.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు హ‌యాంలో  పదేళ్ల పాటు దేశంలో ఎవరి నోట విన్నా ఆంధ్రప్రదేశ్ మాటే విని పించేది. రాష్ట్రానికి ఆయ‌న  తెచ్చిన పెట్టుబడులు, సంస్థలు దేశం దృష్టిని ఆకర్షించాయి.

పెరుగుతున్న మన అవసరాలు తీరాలంటే సంపద సృష్టి జరగాలన్నది టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆలోచన. ఏపీకి వచ్చే సంస్థల కోసం మౌలిక రంగాన్ని అభివృద్ధి చేసారు. ఉత్త‌మ‌ పాలసీలను తీసుకు వచ్చారు. అందుకు ఉదాహరణ సైబరాబాద్ నగర నిర్మాణం. ఇప్పుడు సైబరాబాద్ దేశ విదేశా ల్లోని అనేక సంస్థలకు కీలక వేదికగా నిలిచింది.  అలాగే కొన్ని రంగాల్లో సంస్కరణలు చాలా అవసరం  అని భావిం చారు.  అదే సమయంలో బాబు విజ‌న్‌కు ఫిదా అయి  అప్ప‌టి  ప్ర‌ధాని వాజ్ పేయి  అండ‌గా నిలిచారు. 

జాతీయ స్థాయిలో ఓపెన్ స్కై పాలసీ,టెలికాం పాలసీ, స్వర్ణ చతుర్భుజి రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌లు, సూక్ష్మ సేద్యం వంటివి దేశానికి చంద్ర‌బాబు  పరిచయం చేశారు.  అబ్దుల్ కలాం వంటి వారిని రాష్ట్రపతి గా ఎంపిక చేయ‌డంలోనే బాబు విజ‌న్‌కు అద్దం ప‌డుతోంది. 

అలాగే రంగరాజన్ వంటి వారిని గవర్నర్ గా ఏపీకి తీసుకురాగ‌లిగారు. తెలుగుదేశం నేతల్లో బాలయోగి ని దేశానికి తొలి దళిత స్పీకర్ గా, ఎర్రం నాయుడుని కేంద్రమంత్రిగా చేసి తెలుగుదేశం ఆత్మ సామాజిక న్యా యాన్ని మరింత విస్తృత పరిచారు. 

రాష్ట్ర విభజన తర్వాత 2014 లోనూ ఏపీకి ముఖ్యమంత్రిగా ప్రజలు బాధ్యత ఇస్తే, లోటు బడ్జెట్ రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు సాధించి చూపించారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా నిర్మిం చేందుకు చేసిన‌ కృషి అన‌న్య‌సామాన్యం.

కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం ద్వారా నదుల అనుసంధానం అనే కీలక ప్రక్రియను మొదలు పెట్టిన తొలి సీఎంగా  కీర్తిగ‌డించారు.  అన్న క్యాంటీన్,  విదేశీ విద్య, చంద్రన్న బీమా వంటి  వినూత్న సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచారు.  

ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబు ఏం చేసినా భావితరాల ఉజ్వల భవిష్యత్తే  ఆయ‌న లక్ష్యం అయ్యింది. 14 సంవత్సరాల పాలనా కాలంలో ముఖ్యమంత్రిగా  సాధించిన విజయాలు తెలుగు ప్రజలవి అని చెప్పు కున్నారు.  తాను కేవలం ప్రజలు త‌న‌కు ఇచ్చిన అవకాశాన్ని, అధికారాన్ని వారికి మంచి చేసేందుకు సద్వినియోగం చేసుకున్నానంతేనని చంద్ర‌బాబు చెబుతూంటారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...