ఆఫీసులో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా

 

 

 

ఆఫీసులో ఉన్నపుడు ఒత్తిడిని తొలగించుకొని తీరాలి,లేకుంటే పనికి ఆటంకం కలుగుతుంది. తరచూ బ్రేక్స్ తీసుకోండి. ప్రతి గంటకూ ఐదు నిముషాల చొప్పున కంప్యూటర్ స్క్రీన్ నుంచి బ్రేక్ తీసుకోవాలి. ఎక్కువ సేపు స్క్రీన్ వైపే తిప్పి పనిచేసుకోవటం వల్ల నిర్ణయాత్మక సామర్ధ్యం ప్రభావితం కావటమే కాకుండా,మెడ కూడా స్ట్రెయిన్ అవుతుంది.

 

ప్రతి రెండు గంటలకు ఒకసారి మెడను క్లాక్ వైజ్,యాంటి క్లాక్ వైజ్ లో రొటేట్ చేస్తుండాలి. నిరంతరం కంప్యూటర్ ముందు కూర్చోవటం వల్ల మేడలో స్టిఫ్ నెస్ పెరిగి,స్ట్రెయిన్ అవుతారు. దీనివల్ల ఒత్తిడి తప్పదు. భుజాల్ని ముందు వైపునకు,వెనక్కి మూడేసిసార్లు తిప్పాలి. డీప్ గా   గాలి పీల్చి భుజాలు పైకెత్తాలి. ఐదు లేక్కపెట్టేవరకు ఉండి,భుజాల్ని కిందకుదించి గాలి వదిలేయాలి. బలంగా గాలిపీల్చి,వదలటం థెరపటిక్ మాత్రమే కాదు,దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. గాలి వదిలేసి,ఐదు లెక్కపెట్టి తిరిగి లోపలకు పీల్చాలి. మళ్ళి ఐదు లెక్కపెట్టి బయటకు వదిలేయాలి. ఇలా కొద్ది సేపు చేయాలి. ప్రతిరోజు డీప్ బ్రీతింగ్ చేస్తుంటే,దాని తాలూకు ఫలితాలు ఇట్టే తెలుస్తాయి.

 

 సో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవండి,ఒత్తిడిని అధిగమించండి.