Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కెనడా పార్లమెంట్‌పై కాల్పులు
posted on: Oct 23, 2014 11:57AM

అమెరికా పక్కనే వున్న కెనడా రాజధాని అట్టావాలోని పార్లమెంట్ సమీపంలో బుధవారం ఓ ఆగంతుకుడు ఆ దేశ సైనికుడిపై కాల్పులకు దిగాడు. ఆ తర్వాత సదరు దుండగుడు పార్లమెంట్ భవన సముదాయం వైపు చొచ్చుకెళ్లాడు. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాంతో పార్లమెంట్‌ను మూసివేశారు. కెనడా దేశం పార్లమెంటు ఆవరణలో దుండగులు జరిపిన కాల్పులను అమెరికా అధినేత బారక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నిఘా వర్గాల నుంచి ఆయన సేకరించారు. ఇలాంటి దాడులకు అమెరికా వ్యతిరేకమని ఒబామా తెలిపారు. కెనడా పార్లమెంటుపై కొందరు దుండగులు జరిపిన దాడుల్లో ఒక సైనికుడు మరణించగా మరో సైనికుడు గాయపడ్డాడు.






