జగన్ ని వదలంటున్న నంబర్ 11
posted on: Jan 31, 2026 1:47PM
.webp)
వైసీపీని 11 నంబర్ వదల నంటున్నది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అప్పటి నుంచీ ఆ నంబర్ వినడానికే ఆ పార్టీ ఉలిక్కిపడే పరిస్థితులు వచ్చాయి. 151 టు 11 గా ఆ పార్టీ తిరోగమన ప్రస్థానాన్ని నెటిజనులు అప్పట్లో ఓ ఆట ఆడుకున్నారు. జగన్ ప్రతిపక్ష హోదా అంటూ డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి గైర్హజర్ కావడాన్ని కూడా 11 అంకెను ప్రస్తావిస్తూ నెటిజనులు ఇప్పటికే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అది పక్కన పెడితే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ మేరకు ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నంబర్ 11 తో నెటిజనులు మరో సారి వైసీపీని ట్రోల్ చేస్తున్నారు.
11 నుంచి ప్రారంభయమ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆ 11 మందీ హాజరౌతారా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. అది పక్కన పెడితే.. ఈ సారి బడ్జెట్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారా? అన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో మొదలైంది. ప్రతిపక్ష హోదా అంటూ జగన్ తన ఎమ్మెల్యేలతో సహా అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న సంగతి తెలిసిందే.
అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? లేక నో హోదా నో అసెంబ్లీ అన్న విధానానికి కట్టుబడి ఉంటారా అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. వైసీపీ సభ్యులు 11 మందీ, ఫిబ్రవరి 11న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు హాజరౌతారా? లేదా అన్న ఆసక్తి అయితే సర్వత్రా వ్యక్తమౌతోంది.




.webp)





