Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎన్టీఆర్ ను వెంటాడుతున్న ఫ్లెక్సీ పాలిట్రిక్స్
posted on: Mar 28, 2013 6:28PM

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను ఫ్లెక్సీ లా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాను తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వచ్చేది లేదని గతంలోనే స్పష్టం చేశారు. జగన్ పార్టీ వైఎస్ఆర్.కాంగ్రెస్ మాత్రం తమ పార్టీ ఫ్లెక్సీ లలో ఎన్టీఆర్ ఫోటో పెట్టడం మాత్రం మానడం లేదు. లేటెస్ట్ గా షర్మిలా పాదయాత్ర స్వాగతం చెబుతూ విజయవాడలో కట్టిన ఫ్లెక్సీలో వైకాపా నేతలతో ఎన్టీఆర్ ఉండడం కలకలం రేపుతోంది.
వైకాపా ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఉండడం ఇది మొదటిసారి కాదు. కొన్నిరోజుల క్రితం మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో జగన్, కోడాలి నాని తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో దర్శనమిచ్చింది. ఎన్టీఆర్...జగన్ మీద అభిమానంతో ఆ ఫ్లెక్సీ నేనే పెట్టానని ఓ అభిమాని వివరణ ఇవ్వడంతో వ్యవహారం సద్దుమనిగింది. ఆ వివాదం ముగిసి రెండు రోజులు కాకముందే మళ్ళీ ఎన్టీఆర్ ఫోటో ప్రత్యక్షమవడంతో..టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పార్టీ ఓట్ల కోసం ఎన్టీఆర్ ఫోటో వాడుకుంటున్నారని విమర్శించారు.
ఈ వివాదం పెద్దది కాకముందే..ఎన్టీఆర్ అభిమానులు పోలీసులకు పిర్యాదు చేసి ఎన్టీఆర్ వున్న ఫ్లెక్సీ ని తొలగించారు.



.jpg)


