ఆ డైరెక్టర్‌ని కూడా ఎన్టీఆర్ పట్టేశాడు
posted on Aug 4, 2013 8:44PM

ఎన్టీఆర్ ట్రెండ్ మార్చాడు.. ఇన్నాళ్లు భారీ సక్సెస్ లు ఇచ్చిన డైరెక్టర్స్‌తో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఓ భారీ సినిమా చేస్తున్న డైరెక్టర్‌కి చాన్స్ ఇస్తున్నాడు. టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకులు ఎవరో ఎంచుకొని వారితో సినిమా చేసే ఎన్టీఆర్ ఇప్పుడు సుకుమార్‌కు చాన్స్ ఇస్తున్నాడు.
సుకుమార్ ప్రస్థుతం మహేష్‌బాబు హీరోగా వన్ నేనొక్కడినే అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మహేష్ స్లో పాలసీకి, సుకుమార్ పర్ఫెక్షన్ తోడై మరింత ఆలస్యం అవుతుంది. అయితే మేకింగ్ సంగతి ఎలా ఉన్న ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో సినిమా మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.
దీంతో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా సుకుమార్ ఢైరెక్షన్లో చేయనున్నాడట. ఇప్పటికే సుకుమార్ లైన్ విన్న ఎన్టీఆర్ సూపర్‌గా ఇంప్రెస్ అయ్యాడట. దీంతో ప్రస్తుతం తను చేస్తున్న రామయ్య వస్తావయ్యా, రభస చిత్రాలు పూర్తవగానే సుకుమార్ డైరెక్షన్లో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట. బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈసినిమాకు సంభందించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడించనున్నారు.