Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రైతులను గాలికి వదిలేశారు: బాబు
posted on: Oct 27, 2011 2:48PM
హైదరా
బాద్: నవంబర్ 2వ తేదీ నుంచి కరువు మండలాల్లో రైతు పోరు యాత్ర నిర్వహించాలని నిర్ణయించుకున్నాట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. నవంబర్ 2వ తేదీన అనంతపురం జిల్లా నుంచి తన యాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.ఈ సందర్బంగా ఆయన రైతు సమస్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ఆయన విమర్సించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎరువులను అధిక ధరలకు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 700 మండలాల్లో కరువు నెలకొని ఉందని ఆయన చెప్పారు. సెజ్‌ల పేరుతో రైతుల భూములు లాక్కుంటున్నారని ఆయన అన్నారు. భూములకు మార్కెట్ ధర ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. విత్తనాల ధరలు విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు. రైతులకు బ్యాంకులు అప్పులివ్వడం లేదని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని కేంద్రం చిన్న చూపు చూస్తోందని ఆయన విమర్శించారు.
కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలు సగానికి పైగా ఎండిపోయాయని ఆయన అన్నారు. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన విమర్శించారు. తాము పోరుబాటు చేపడుతామని ఆయన అన్నారు. వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం స్వామినాథన్ నివేదికను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. నవంబర్ 2 నుంచి 22 జిల్లాల్లో రైతు పోరు యాత్ర కార్యక్రమం నిర్వహిస్తానని ఆయన చెప్పారు. 37 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆయన అన్నారు. సాగునీటి సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు.



.jpeg)


