TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నూడిల్స్ తిన్న ముగ్గురు అక్కచెల్లెల్లకు అస్వస్థత..అక్క మృతి

Published on: Tue Apr 26, 2016 11:20AM

విజయవాడ నగరంలో దారుణం జరిగింది. నగరంలోని యనమలకుదురులోనూడిల్స్ తిన్న ముగ్గురు అక్కచెల్లెల్లు అస్వస్థతకు గురయ్యారు. మానస, మమత, థెరిసా అనే ముగ్గురు అక్కచెల్లెల్లు ఉదయం అల్పాహారం నిమిత్తం నూడిల్స్ చేసుకుని తిన్నారు. అవి తిన్న కొద్దిసేపటికే కడుపులో వికారం, వాంతులు కావడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అక్క మానస మరణించింది. మమత, థెరిసా కోలుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నూడిల్స్‌ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు తరలించారు.