Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నాన్ స్టిక్ వంటపాత్రలు ఎంత చేటు చేస్తాయో తెలుసా?
posted on: Feb 28, 2025 9:30AM

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఉపయోగించడం సర్వసాధారణమైపోయింది. ఈ పాత్రలు వంటను సులభతరం చేస్తాయి, వంట చేసేటప్పుడు పదార్థాలు మాడిపోవడం, వంటపాత్రలకు అతుక్కుపోవడం వంటి సమస్యలు ఉండవు. అయితే నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుంటే..
విషపూరిత రసాయనాల ప్రమాదం..
నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేయడానికి పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్ (PTFE) అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇది ఆహారం అంటుకోకుండా నిరోధించే సింథటిక్ పదార్థం. అయితే ఈ పాత్రను వేడెక్కినప్పుడు, అది రసాయనికంగా విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. విషపూరిత పొగలను విడుదల చేస్తుంది. ఈ పొగలను పీల్చడం వల్ల తలనొప్పి, తలతిరుగుడు, ఫ్లూ లాంటి లక్షణాలు వస్తాయి. ఈ పొగ వాతావరణంలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఆరోగద్య సమస్యలు కూడా వస్తాయి.
పెర్ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్ (PFOA) ప్రమాదాలు..
నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేసే ప్రక్రియలో PFOA అనే రసాయనాన్ని కూడా ఉపయోగిస్తారు. ఈ రసాయనం ఆరోగ్యానికి హానికరం. PFOA వల్ల క్యాన్సర్, థైరాయిడ్ రుగ్మతలు, కాలేయం దెబ్బతినడం, రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఇప్పుడు చాలా కంపెనీలు PFOA లేని ఉత్పత్తులను తయారు చేస్తున్నప్పటికీ కొన్నింటిలో ఈ రసాయనం ఉండే అవకాశం ఉంది.
హానికరమైన పదార్థాల విడుదల..
నాన్-స్టిక్ వంట సామాగ్రిని చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసినప్పుడు, దాని పూత విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. ఈ చిన్న కణాలు ఆహారంలోకి కలిసిపోతాయి. ఈ కణాలు శరీరంలోకి వెళ్లిన తర్వాత విషపూరితంగా మారవచ్చు. దీనివల్ల జీర్ణవ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి .
దీర్ఘకాలిక వాడకం..
నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల శరీరంలో రసాయనాలు పేరుకుపోతాయి. ఈ రసాయనాలు శరీరంలో నెమ్మదిగా పేరుకుపోయి దీర్ఘకాలంలో తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా, ఇది హార్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది.
పర్యావరణంపై ప్రభావం..
నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేయడం, తరువాత పాడైపోయిన నాన్ స్టిక్ పాత్రలను నాశనం చేసే ప్రక్రియ కూడా పర్యావరణానికి హాని కలిగిస్తుంది. ఈ పాత్రలలో ఉపయోగించే రసాయనాలు ప్రకృతిలో త్వరగా కరగవు, పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి . దీనివల్ల మనుషులకే కాదు, జంతువులు, మొక్కలు కూడా నష్టపోతాయి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...


.webp)
.webp)


