Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేటి నుంచే నామినేషన్లు..మళ్ళీ ఎన్నికల పోరు
posted on: Jan 7, 2019 10:37AM
.jpg)
గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. మొదటి విడత నామినేషన్ల పర్వం ఇవాళ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యింది. మొత్తం 197 మండలాల్లో 4480 పంచాయతీల్లోని సర్పంచ్ పదవులు, వీటి పరిధిలోని 39,832 వార్డు పదవులకు ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్‌లను స్వీకరిస్తారు. ఇందుకు సంబంధించి ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఇతర సిబ్బందిని నియామించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ నెల 9 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 10న నామినేషన్లను పరిశీలించి.. ఆ తర్వాత అర్హులైన అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తారు.11న నామినేషన్లపై అప్పీళ్లను స్వీకరించి, 12న వాటిని పరిష్కరిస్తారు.
నామినేషన్ల ఉపసంహరణ గడువు 13 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి ఓట్లను లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికల సమరం క్రమంగా దగ్గర పడడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.






