Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నోయిడా దాడిపై సుష్మ.. యోగి భరోసా ఇచ్చారు.
posted on: Mar 28, 2017 12:22PM

నోయిడాలో నైజీరియన్లపై స్థానికులు దాడి చేసిన సంగతి తెలిసిందే. మనీశ్ కారి అనే విద్యార్ది చనిపోయిన నేపథ్యంలో డ్రగ్స్ బారిన పడే మనీశ్ చనిపోయాడని, అందుకు నైజీరియన్లే కారణం అని వారిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నైజీరియన్లు కేంద్రమంత్రి సుష్మ స్వరాజ్ ను సాయం కోరుతూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. నోయిడాలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని సత్వరమే స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ ట్వీట్ కు స్పందించిన సుష్మ స్వరాజ్.. దాడికి గురైన ఆఫ్రికన్ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని.. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని.. ఆయన తగిన భరోసా ఇచ్చారని చెప్పారు.దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని కోరారు. దీనిపై పారదర్శకమైన దర్యాప్తు చేపడతామని యూపీ సీఎం హామీ ఇచ్చినట్లు సుష్మ ట్వీట్ చేశారు.


.jpg)
.jpg)


