TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నోబెల్ సరే... పరీక్షలెలా... మలాలా

Published on: Mon Oct 13, 2014 3:26PM

 

నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్‌జాయ్‌ డిసెంబర్‌లో జరిగే నోబెల్ పురస్కార ప్రదానోత్సవానికి వెళ్ళి తీరాలి. అయితే అదే సమయంలో తనకు పరీక్షలు వున్నాయని, వాటికి కూడా హాజరవ్వాలని మలాలా ఆందోళన చెందుతోంది. నోబెల్ అవార్డు తీసుకునే సమయం, పరీక్షల సమయం ఒకేసారి రావడంతో కలత చెందుతున్నట్టు మలాలా చెబుతోంది. రెండేళ్లక్రితం తాలిబాన్ ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఈ పాకిస్థాన్ బాలిక మరణాన్ని జయించి ఉద్యమబాటలో కొనసాగుతూ బాలికల విద్యాహక్కు కోసం కృషి చేస్తున్న విషయం తెలిసిందే.