TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చట్టసభ సభ్యులకూ నో వర్క్.. నో పే.. అయ్యన్నపాత్రుడు

Published on: Thu Jan 22, 2026 8:38AM

చట్టసభల్లో కూడా నోవర్క్ నో పే విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. కొందరు సభ్యులు సభకు హాజరు కాకుండా వేతనాలు తీసుకుంటున్నారన్న ఆయన  ఉద్యోగులు విధులకు గైర్హాజరైతే వేతనాలు నిలిపివేస్తారు..

మరి ఎమ్మెల్యేల విషయంలో ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయరని జనం ప్రశ్నిస్తున్నారన్నారు.  నో వర్క్ నో పే విధానాన్ని చట్ట సభల సభ్యులకు అమలు చేసే విధంగా చట్టం చేయాలని అఖిల భారత సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని అయ్యన్నపాత్రుడు అన్నారు.