TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇక నరసింహావతారమే..!

Published on: Fri Nov 9, 2012 11:36AM

NO DEAD LINES, ONLY DEATH LINES, KCR SCOLD CONGRESS, KCR RETURN FROM DELHI, KCR SPOKE ARROGANT, KCR POET, KCR WORKS, KCR RE ENTRY

 

మరోసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని నమ్మించి దగా చేసిందని కేసీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్ర సాధనకు ఇకపై డెడ్ లైన్లుండవని, పూర్తిగా డెత్ లైన్లే ఉంటాయని హెచ్చరించారు. టిఆర్ ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పినా ఆ పార్టీ అధిష్ఠానంనుంచి కనీస స్పందన కరువయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఈ దెబ్బతో టిఆర్ఎస్ కి కాంగ్రెస్ శని వదిలిపోయిందని, నల్గొండజిల్లా సూర్యాపేట సభలో ఆ పార్టీకి నీళ్లొదులుతామని కేసీఆర్ ప్రకటించారు. కరీంనగల్ లో జరిగిన రెండు రోజుల మేధోమథనంలో పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారని కెసిఆర్ చెప్పుకొచ్చారు. రాబోయే సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణ ఏర్పాటుని ఎవరూ ఆపలేరంటూ సవాల్ చేశారు.

 

2014 ఎన్నికల్లో సిపిఐతో సహా ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోకుండా నేరుగా ఎన్నికల్లో నిలబడతామని కెసీఆర్ తేల్చి చెప్పారు. ఇకపై కాంగ్రెస్ లో టిఆర్ ఎస్ విలీనం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ మౌనం వీడి మార్కెట్లో రిలీజైండు. ఇగ నరసింహావతారం చూస్తరు, రోజూ కార్యక్రమాలుంటయ్.. తెలంగాణ భవన్ ల సందడే సందడి అంటూ ఉత్సాహంగా సమరనాదం చేశారు.