నితీశ్ చంద్రబాబును లైట్ తీసుకున్నారా?

బీహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో నితీశ్ కుమార్ ఈ రోజు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నితీశ్ కుమార్ అంగరంగ వైభవంగా జరిగే తన ప్రమాణస్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులను.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు. కానీ ఇంతమందికి ఆహ్వానం పంపించిన నితీశ్ మాత్రం ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును మాత్రం ఆహ్వానించలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే మోడీకి చంద్రబాబు సన్నిహితుడు కాబట్టి ఆహ్వానించలేదా అని అనుకుంటున్నారు.. కానీ అలా అయితే నితీశ్ మోడీనే ఆహ్వానించారు కదా.. మరి చంద్రబాబును ఆహ్వానించడంలో ఏముంది అని మరికొందరు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అందునా నితీశ్ కు చంద్రబాబుకు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఇద్దరూ సుపరిచితులే.. అయినా చంద్రబాబును మాటవరుసకైనా ఆహ్వానించకుండా ఎందుకు లైట్ తీసుకున్నారా అని ఇప్పుడు అందరి ప్రశ్న. అంతేకాదు బాబుకు ఇన్విటేషన్ అందకపోవటంపై ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కూడా ఆరా తీశారని చెబుతున్నారు. మరి చంద్రబాబును నితిశ్ ఆహ్వానించకపోవడానికి గల కారణాలు ఏంటో ఆయనకే తెలియాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu