TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భూమి మొత్తం స్కాన్.. నిసార్ శాటిలైట్ స్పెషాలిటీ

Published on: Tue Jul 29, 2025 10:57AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక భారీ రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది.సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి  బుధవారం  (జులై 30) జిఎస్ఎల్వి ఎఫ్-16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు.ఇస్రో, నాసా సంయుక్తంగా నిర్మించి, రూపకల్పన చేసిన ప్రపంచంలోనే అత్యంత సామర్ధ్యం కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం నిస్సార్  ను రోదసిలోనికి పంపనున్నారు.

భూ పరిభ్రమణం లో వస్తున్న మార్పులను  ప్రతి రోజూ ఒకసారి స్కాన్ చేసి సమగ్ర సమా చారాన్ని ఎప్పటికప్పుడు  అందించే విధంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు.  బుధవారం (జులై 30) సాయంత్రం 5.40 గంటలకు  తిరుపతి   శ్రీహరికోటలోని  రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్16 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో రంగం సిద్ధం చేసింది.

 ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ మంగళవారం (జులై 29)మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రారంభం కానుంది.  27 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్  తరువాత బుధవారం (జులై 30) సాయంత్రం 5.40 గంటలకు జీఎస్ఎల్వీ 16 ను ప్రయోగించనున్నారు. వాస్తవానికి ఈ ప్రయోగం  జూన్ లోనే జరగాల్సి ఉండగా  అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

 నిస్సార్ ఉపగ్రహాన్ని భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య-సమకాలిక కక్ష్య (ఎస్ఎస్ఓ)లోకి ప్రవేశపెడుతుంది. నిసార్ ఉప్రాగ్రహం డ్యూయెల్ రాడార్ సిస్టమ్ తో రూపొందింది. ఎస్ బ్యాండ్ సిథటిక్ ఎపర్చర్ రాడారు ఇస్రో, ఎల్ బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ ను నాసా రూపొం దించాయి. ఇది మేఘాలను దాటిన తర్వాత కూడా సెం టీమీటర్ స్థాయిలో భూమిపై కదలికలను పసిగట్ట గలదు. ఈ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు మొత్తం భూమిని స్కాన్ చేస్తుంది.  బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్లో ఈ శాటిలైటు రూపొందించారు. ఈ ఉపగ్రహం ద్వారా భూమికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరించే  అవకాశం లభిస్తుంది. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్పోటనాలు, కొండచరియలు విరిగి పడడం వంటి ప్రకృతి విపత్తులకు సంబంధించి ముందస్తు సమాచారాన్నినిసార్ అందిస్తుంది. ఈ ఉపగ్రహం బరువు దాదాపు 2800 కిలోలు.