నిమ్మగడ్డకు మద్యంతర బెయిల్

posted on: Jul 11, 2013 5:48PM

 

 

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు గురువారం నాంపల్లి సీబీఐ కోర్టు కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిమ్మగడ్డ సమీప బంధువు రామ్ ప్రకాష్ ఆర్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతి ఇస్తూ, బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు 13 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రేపు ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి నిమ్మగడ్డ విడుదల అయ్యే అవకాశం ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...