నిడదవోలు మునిసిపాలిటీ జనసేన వశం

posted on: Apr 13, 2025 4:56PM

తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పార్టీ అయిన జనసేన ఖాతాలోకి ఓ మునిసిపాలిటీ చేరింది. రాష్ట్రంలో జనసేన ఖాతాలో చేరిన తొలి మునిసిపాలిటీగా నిడదవోలు మునిసిపాలిటీ నిలిచింది. ఏపీలో జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీ చేరింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో 27 మంది వైసీపీ, ఒక టీడీపీ కౌన్సిలర్ ఉండేవారు. అయితే వైసీపీకి చెందిన   14 మంది కౌన్సిలర్లు జనసేన గూటికి చేరడంతో  తెలుగుదేశం కౌన్సిలర్ ను కూడా కలుపుకుంటే జనసేన కౌన్సిలర్ల బలం 15కు చేరింది.

దీంతో నిడదవోలు మునిసిపాలిటీ జనసేన వశమైంది.  వాస్తవానికి జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా మున్సిపాలిటీని దక్కించుకోవడం విశేషం.  జీరో సభ్యుల నుంచి మున్సిపాలిటీ జనసేన పరం అయ్యేలా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ రాజకీయ చాణక్యం చేశారు.  కాగా  కూటమి ప్రభుత్వం పాలన నచ్చి వైసీపీ కౌన్సిలర్లు జనసేనకు మద్దతు తెలిపారని   మంత్రి కందుల దుర్గేష్  చెబుతున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...