TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎన్ఐఏ దర్యాప్తు

Published on: Sat Jun 14, 2025 12:11PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. విమానం కుప్పకూలిపోవడం వెనుక కుట్ర కోణం ఉందా అన్న కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది. ఈ దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ బృందం విమానం కూలిన ప్రాంతానికి చేరుకుని ఆధారాల సేకరణలో నిమగ్నమైంది. ఈ సందర్భంగా ఒక మృత దేహం బయటపడిందని తెలుస్తోంది. ఇలా ఉండగా విమాన ప్రమాద ఘటనా స్థలానికి డీజీసీఏ అధికారులు కూడా చేరుకున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకూ విమాన శకలాలను తొలగించవద్దని ఇప్పటికే డీజీసీఏ ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఇలా ఉండగా అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం తరువాత కేంద్ర విమానయాన శాఖ తొలిసారిగా సమావేశమైంది.  పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో విమానయాన భద్రతపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి  డీజీసీఏ డీజీ, ఏఏఐ ఉన్నతాధికారులు, పౌర విమానయాన కార్యదర్శి, మంత్రిత్వశాఖ అధికారులు పాల్గొన్నారు.