Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బ్యాట్స్ మెన్ క్యూ.. ఇండియా ఖాతాలో చెత్త రికార్డు
posted on: Feb 6, 2019 4:57PM

వన్డే సిరీస్ గెలుపు ఉత్సాహంతో ఉన్న ఇండియాకు న్యూజిలాండ్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. కివీస్ ఓపెనర్లు చెలరేగిపోయారు. రెండో ఓవర్ నుంచే బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వికెట్ కీపర్ టిమ్ సిఫర్ట్‌తో మున్రో కూడా వేగంగా పరుగులు సాధించడంతో 8.2 ఓవర్లలోనే 86 పరుగులు దాటింది. ఈ దిశలో మున్రోను అవుట్ చేసిన క్రునాల్ పాండ్యా టీమిండియాకు తొలి బ్రేక్ అందించాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్స్‌సన్‌తో జతకలిసిన సిఫర్ట్ బౌండరీలతో చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
తర్వాత బౌలర్లు కూడా విజృంభించడంతో టీమిండియా ఏ దశలోనూ లక్ష్యం దిశగా అడుగులు వేయలేదు. రోహిత్ శర్మ.. మూడో ఓవర్ రెండో బంతికే అవుట్ అయ్యాడు. ఐదు బంతులు ఆడి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ 29 పరుగులు, విజయ్ శంకర్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత వికెట్ కీపర్లు రిషబ్ పంత్ 4 పరుగులు, దినేశ్ కార్తీక్ 5 పరుగులు, హార్ధిక్ పాండ్యా 4 పరుగులు చేసి వెంటనే వెనుదిరిగారు. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ధోనీ, కృనాల్ పాండ్యా ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే కొండంత లక్ష్యం కారణంగా రన్‌రేట్ పెరుగుతూ పోయింది. ఏడో వికెట్‌కు 52 పరుగులు జోడించిన తర్వాత 20 పరుగులు చేసిన కృనాల్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన భువనేశ్వర్ ఒక్క పరుగు చేసి అవుట్ అవ్వగా... 30 బంతుల్లో 5 ఫోర్లు, ఒక్క సిక్సర్‌తో 39 పరుగులు చేసిన ధోనీ సౌథీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అప్పటికే లక్ష్యం చివరి ఓవర్లో 84 పరుగులు. చివరి ఓవర్ రెండో బంతికే చాహాల్ అవుట్ కావడంతో 139 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. మొత్తానికి ఇండియా 80 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అయితే ఈ ఓటమితో ఇండియా ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇండియా ఇప్పటివరకూ ఆడిన అంతర్జాతీయ టీ-20ల్లో నేటి మ్యాచ్‌లో అత్యధిక పరుగుల తేడాతో ఓడి.. చెత్త రికార్డును నమోదు చేసింది. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ-20 మ్యాచ్‌లో భారత్ 49 పరుగుల తేడాతో ఓడింది. కాగా నేడు 80 పరుగుల తేడాతో ఓడి.. ఆ రికార్డును అధిగమించింది.






