Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెస్ లో ముగ్గురు మొనగాళ్లు
posted on: Nov 15, 2018 3:21PM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తెలంగాణలో పార్టీకి ఇప్పటికే ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండగా అదనంగా మూడో వ్యక్తిని నియమించారు.కమ్మ సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుం కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా మెదక్ జిల్లాకు చెందిన జెట్టి కుసుం కుమార్ ఇప్పటివరకూ తెలంగాణ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందినవారికి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత లేకపోవడంతో... ఆ వర్గానికి చెందిన జెట్టి కుసుం కుమార్ కి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
.jpeg)






