Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బ్రిటన్‌కు బుల్లి యువరాజు
posted on: Jul 23, 2013 7:43AM

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్, ఆయన భార్య కేట్ మిడల్టన్‌లకు బాబు జన్మించాడనే వార్తతో రాజకుటుంబంతో పాటు బ్రిటన్ అంతట సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు రాజకుటుంబానికి అభినందనలు తెలిపారు. సోమవారం సాయంత్రం 4.24 నిమిషాలకు మగబిడ్డకు యువరాణి కేట్‌మిడిల్‌టన్ జన్మనిచ్చింది. ప్రిన్స్ డయానా తన ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిన పాడింగ్టన్ లోని సెయింట్ మేరీస్ హస్పిటల్ లోనే కేట్ మిడల్టన్ కూడా తన బాబుకు జన్మనిచ్చింది.
ఈ విషయాన్ని బ్రిటన్ ప్రదాన మంత్రి కామెరూన్ ట్విటర్లో వెల్లడించారు. కేట్ మిడిల్ టన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ప్రెస్‌తో పాటు , పలువురు ప్రముఖులు ప్రజలు హస్పిటల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బ్రిటన్ మీడియా అక్కడి పరిస్థితులను నిరంతరం లైవ్ అప్‌డేట్స్ ఇచ్చింది..
అంతేకాదు రాయల్ బేబి పుట్టటానికి ముందే వారికి పెట్టబోయే పేర్లపై కూడా భారీ స్థాయిలో బెట్టింగ్ జరిగింది. రాయల్ బేబీగా వ్యవహరిస్తున్న బేబీ పేరు గురించి ప్రధానంగా రెండు పేర్లమీద బెట్టింగ్ జరిగింది. కేట్‌కు పుట్టబోయేది ఆడపిల్ల అయితే ఆ పాప పేరు ‘అలెగ్జాండ్రా’ అని మగపిల్లవాడైతే ఆ బాబు పేరు ‘జార్జ్’ అవుతుందని బెట్టింగ్‌రాయుళ్లు అంచనా వేశారు. ఇంతకీ బ్రిటన్ రాజవంశం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..


.jpg)
.jpg)


